ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం ‘రాకా’ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం బన్నీ రిస్కీ యాక్షన్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్‌ను ప్రత్యేకంగా రూపొందించేందుకు చిత్ర బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంటర్నేషనల్ టెక్నీషియన్ల పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. బన్నీ పాత్రను గత చిత్రాలకు భిన్నంగా చూపించేందుకు దర్శకుడు అట్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖ నటీమణులు నటిస్తున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
అల్లు అర్జున్ యాక్షన్, అట్లీ దర్శకత్వ శైలి కలిస్తే తెరపై ఎలాంటి అద్భుతం కనిపించనుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే రిస్కీ స్టంట్స్, ఇంట్రో సీన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.