ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో సెప్టెంబర్ 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని సమాచారం. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో హైదరాబాద్, మెదక్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ తదితర జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తాజా అప్‌డేట్‌లో పేర్కొన్నారు.
ఏపీలోనూ వాతావరణ పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం.
రైతులు, ప్రయాణికులు స్థానిక వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.