అమరావతిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కీలక సమావేశం జరిగింది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తొలుత చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ అల్పాహార విందులో పాల్గొన్నారు.
అనంతరం రానున్న స్థానిక ఎన్నికలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. కూటమి పార్టీల మధ్య స్థానాల సర్దుబాటు, ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి? కీలక కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవడం, స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతను చాటుతూ అన్ని స్థాయిల్లో బలమైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా వ్యూహరచన చేసినట్లు సమాచారం.
దాదాపు రెండు గంటలపాటు ఈ కీలక భేటీ కొనసాగింది.