మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / చంద్రంపాలెం జాతర గట్టు దుర్గాలమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనం
చంద్రంపాలెం జాతర గట్టు దుర్గాలమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనం
AP TODAY
AP TODAY

1 day ago

మధురవాడ, అక్టోబర్ 12: విశాఖపట్నం జిల్లా మధురవాడలోని చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శ్రీ గాయత్రీదేవి రూపంలో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

ఉత్సవాల్లో భాగంగా ముందుగా అమ్మవారి విగ్రహానికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, జలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ గాయత్రీదేవి అలంకరణ చేపట్టారు. ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, మూర్తి శర్మల బృందం ఆధ్వర్యంలో కుంకుమార్చనలు, ప్రత్యేక సహస్ర పుష్పార్చనలు, సూర్య నమస్కారాలు, హోమం, నీరాజనం, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

మధురవాడ కృష్ణానగర్‌కు చెందిన దీవి జగ్గారావు, లక్ష్మి దంపతుల సహకారంతో అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించి, అనంతరం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, కమిటీ అధ్యక్షుడు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పిళ్లా పోతరాజు, పిళ్లా మోహన్ శివకృష్ణ, జనరల్ సెక్రటరీ నాగోతి తాతారావు, సెక్రటరీ పోతిన పైడిరాజు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి పిళ్లా వెంకటరమణ, జాయింట్ సెక్రటరీ పోతిన ఉమా మహేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గూడేల రాజు, పొట్నూరి హరికృష్ణ, బంక వాసు, మీడియా ఇన్‌చార్జి బోగవిల్లి రాము, పిళ్లా చిన్ని, కమిటీ సభ్యులు కేశనకుర్తి అప్పారావు, పిళ్లా వెంకట అప్పారావు (రాజు), గూడేల కామేశ్వరరావు, పిళ్లా గోకుల్ కుమార్, దుర్గాశి మణికంఠ, పిళ్లా సురేష్, పీస లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా సత్యన్నారాయణ, పిళ్లా శ్రీనివాసరావు, పీస రామారావు, జగుపిల్లి నానితో పాటు ముఖ్య సభ్యులు జగుపిల్లి అప్పారావు, పోతిన వెంకటరమణ, పిళ్లా వెంకటరమణ, మరుపిల్లి బుల్లిబాబు తదితరులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement