ఫ్లైదుబాయ్ ఘటనలో నిందితుడు హమ్మామ్ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. UAE పోలీసుల విచారణలో గాజా కోసం ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు అతను వెల్లడించినట్టు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.
తాను అమరవీరుడిగా మిగలాలని కోరుకున్నట్లు హమ్మామ్ చెప్పినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటనలో కెప్టెన్ స్విట్ మచ్చర్ ధైర్యంగా ప్రతిఘటించడంతో హమ్మామ్ ప్రణాళిక విఫలమైనట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
ఇదిలా ఉండగా, హమ్మామ్ గతంలో ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే కొన్ని దేశాలను కూడా సందర్శించినట్లు విచారణలో వెల్లడైనట్టు సమాచారం. ఈ పర్యటనలకు, ఫ్లైదుబాయ్ ఘటనకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి ఉద్దేశాలు, నేపథ్యం, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై UAE అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.