మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / జనసేన హిందూపురం పార్లమెంట్ నిర్వాహక దళంలో మడకశిర వెంకటేష్ గుప్తాకు చోటు
జనసేన హిందూపురం పార్లమెంట్ నిర్వాహక దళంలో మడకశిర వెంకటేష్ గుప్తాకు చోటు
AP TODAY
AP TODAY

1 day ago

మడకశిర: జనసేన పార్టీ హిందూపురం పార్లమెంట్ నిర్వాహక దళంలో మడకశిరకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు వెంకటేష్ గుప్తాకు చోటు లభించింది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ అధిష్ఠానం హిందూపురం పార్లమెంట్ పరిధిలో 32 మంది సభ్యులతో నిర్వాహక దళాన్ని ఏర్పాటు చేసింది. ఈ దళంలో వెంకటేష్ గుప్తాను సభ్యుడిగా నియమించింది.

ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి నిర్వాహక దళంలో సభ్యుడిగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వెంకటేష్ గుప్తా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్లమెంట్ సమన్వయకర్తలు చిలక మధుసూదన రెడ్డి, నవీన్ నిశ్చల్, అమర్ కార్తికేయలకు ధన్యవాదాలు తెలియజేశారు.

పార్టీ అధిష్ఠానం తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెంకటేష్ గుప్తా పేర్కొన్నారు. జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకత్వం చేపడుతున్న ఈ నియామకాలు హిందూపురం పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యకలాపాల సమన్వయానికి దోహదపడనున్నాయి.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement