మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / నైటీలు ధరించి ఏటీఎంలో చోరీ.. గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసి నగదు అపహరణ!
నైటీలు ధరించి ఏటీఎంలో చోరీ.. గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసి నగదు అపహరణ!
AP TODAY
AP TODAY

1 day ago

కామారెడ్డి: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఏటీఎం చోరీ ఘటన కలకలం రేపింది. స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు నైటీలు ధరించి గాంధారిలోని ఎస్‌బీఐ ఏటీఎంలోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది. నైటీలు ధరించి రావడం, గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేయడం వంటి అంశాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్కార్పియో వాహనం వివరాలపై కూడా దర్యాప్తు చేపట్టి, దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

అయితే ఏటీఎం నుంచి ఎంత నగదు చోరీకి గురైందన్న విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత చోరీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement