ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ డ్రైవర్ తన్నీరు శ్రీహరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం రాత్రి చిలకలూరిపేటలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. శ్రీహరి తన పల్సర్ బైక్‌పై చిలకలూరిపేట నుంచి చెరువు రోడ్డు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్‌ను మలుపు తిప్పుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఆయన బైక్‌ను ఢీకొట్టింది.
కారు ఢీకొనడంతో శ్రీహరి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు, డ్రైవర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.