మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మంత్రి లోకేష్.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మంత్రి లోకేష్.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
AP TODAY
AP TODAY

September 16, 2026

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న మంత్రి లోకేష్.. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

అనంతరం మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రి లోకేష్, కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు.

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు.

కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా 2027 టీటీడీ డైరీ, క్యాలెండర్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

పెద్దశేష వాహనసేవలో పాల్గొన్న లోకేష్

అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులు ఆలయం ముందు ఉన్న వాహన మండపానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన పెద్దశేష వాహనసేవలో పాల్గొన్నారు. పెద్దశేష వాహనంపై కొలువుదీరిన శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement