డ్రగ్స్ నివారణ, మహిళల భద్రత, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం: ప్రజల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలు, మహిళల భద్రత, రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో త్రిశూల్ వ్యూహం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
మైలవరం పట్టణంలోని అన్నా క్యాంటీన్ నుంచి పంచాయతీ సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. డ్రగ్ అబ్యూస్‌ను అరికట్టడం, మహిళల భద్రతకు ప్రాధాన్యం కల్పించడం, రహదారి నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ ర్యాలీలో ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ లక్ష్మీ నారాయణ ఐపీఎస్, మైలవరం ఏసీపీ రామచంద్రరావు, సీఐ కిషోర్ బాబుతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, రహదారి నిబంధనలు పాటించాలని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు.