మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / ‘ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు’.. అర్జీలపై కలెక్టర్‌ సమీక్ష
‘ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు’.. అర్జీలపై కలెక్టర్‌ సమీక్ష
AP TODAY
AP TODAY

September 18, 2026

 

చందర్లపాడు, సెప్టెంబర్‌ 18: ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ఆదేశించారు. ప్రజా సమస్యలను కేవలం అర్జీల పరిష్కారంగా కాకుండా, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు తునికిపాటి ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్. ఇలక్కియతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు, అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి నెలా ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి నాలుగు సార్లు ప్రత్యేక పీజీఆర్ఎస్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడులో ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీపై పకడ్బందీగా, పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ప్రధానంగా రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలు, పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించిన సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కలెక్టర్‌ సూచించారు. అర్జీలో పేర్కొన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత వ్యక్తులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న అనంతరం నిబంధనల మేరకు సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ప్రతి అర్జీకి పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్తులో అదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్‌ సూచించారు.

ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, భూ సమస్యలు, పంచాయతీరాజ్‌ తదితర అంశాలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి సత్వర పరిష్కారం అందించడమే ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో గడ్డిపాటి అనిల్‌ కుమార్‌, పీజీఆర్ఎస్‌ నోడల్‌ అధికారి జి. జ్యోతి, తహసీల్దార్‌ వాసిరెడ్డి రామకోటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

జిల్లా సమాచార శాఖ, విజయవాడ ద్వారా జారీ.

Published By : R V Satish Reddy
AP TODAY LIVE
Advertisement