మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కు కీలక ప్రాజెక్టులు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు!
విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కు కీలక ప్రాజెక్టులు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు!
AP TODAY
AP TODAY

October 6, 2026

విశాఖపట్నం: దేశ రక్షణ రంగంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) కీలక పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని హెచ్‌ఎస్‌ఎల్‌లో నూతన స్లిప్‌వేతో పాటు ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS-1)ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పురాతన కాలం నుంచి నౌకాయానం ద్వారా వాణిజ్యం కొనసాగుతోందని, హిందుస్థాన్ షిప్‌యార్డ్ మారిటైమ్ కస్టోడియన్‌గా కీలక సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. నావల్ డాక్‌యార్డ్, హిందుస్థాన్ షిప్‌యార్డ్ నౌకల నిర్వహణలో కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

దేశ రక్షణతో పాటు సముద్ర జలాల పరిరక్షణకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లోని కీల్ కేవలం నౌకా నిర్మాణ ప్రక్రియ మాత్రమే కాదని, దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

దేశ మారిటైమ్ రంగానికి ఏపీ ప్రభుత్వం సహకరిస్తోందని, సీఎం చంద్రబాబు సహకారం బాగుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ శ్రీభరత్‌తో పాటు నౌకాదళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement