టాటా సన్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయానికి బోర్డులో మెజారిటీ మద్దతు లభించింది. అయితే టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.
చంద్రశేఖరన్ మరోసారి బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించడంతో ఆయనకు మరో ఐదేళ్ల పదవీకాలం లభించే పరిస్థితి ఏర్పడింది.
టాటా సన్స్‌లో భవిష్యత్ నాయకత్వం, సంస్థ షేర్ మార్కెట్ లిస్టింగ్ తదితర అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
నోయెల్ టాటా నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు, టాటా ట్రస్ట్స్ మరియు టాటా సన్స్ బోర్డు మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.