మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / రాఖీ పౌర్ణమి వేళ ప్రయాణికులకు షాక్.. ప్రత్యేక బస్సుల్లో 1.5 రెట్లు ఛార్జీలు
రాఖీ పౌర్ణమి వేళ ప్రయాణికులకు షాక్.. ప్రత్యేక బస్సుల్లో 1.5 రెట్లు ఛార్జీలు
AP TODAY
AP TODAY

August 28, 2026

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీ ఆగస్టు 27 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే, ఈ ప్రత్యేక సర్వీసుల్లో సాధారణ ఛార్జీల కంటే అధికంగా టికెట్ ధరలు వసూలు చేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎంజీబీఎస్ నుంచి జడ్చర్లకు సాధారణ ఛార్జీ రూ.150 ఉండగా ప్రత్యేక బస్సుల్లో రూ.190, కరీంనగర్‌కు సూపర్ డీలక్స్ బస్సులో రూ.300 ఉండే టికెట్ ప్రస్తుతం రూ.400గా వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు.

ముందస్తు సమాచారం లేకుండా ధరలు పెంచడంపై పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లాల్సిన సామాన్యులకు అదనపు ఛార్జీలు భారంగా మారాయని వారు వాపోతున్నారు.

అయితే, పండుగ సమయాల్లో ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 1.5 రెట్లు వరకు అధికంగా వసూలు చేసే వెసులుబాటు 1981 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంస్థకు ఉందని టీజీఎస్‌ఆర్టీసీ పీఆర్‌వో ప్రసన్న వివరణ ఇచ్చారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేసి, సురక్షిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement