మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / యూజీసీ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి.. వర్షంలోనూ ప్రభుత్వ వైద్యుల ధర్నా
యూజీసీ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి.. వర్షంలోనూ ప్రభుత్వ వైద్యుల ధర్నా
AP TODAY
AP TODAY

September 23, 2026

కేజీహెచ్ ఎదుట డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్యుల నిరసన.. బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామన్న ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: డీఎంఈ (డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలోని ప్రభుత్వ వైద్యులకు రావాల్సిన 2016 యూజీసీ పీఆర్సీ జీతభత్యాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఐ. బాబ్జి శ్యామ్ కుమార్ డిమాండ్ చేశారు.

యూజీసీ పీఆర్సీ బకాయిల చెల్లింపుపై గత కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొనసాగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం విశాఖపట్నంలో వైద్యులు ధర్నా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం, ఆంధ్ర వైద్య కళాశాల విభాగం ఆధ్వర్యంలో కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్) సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఈ నిరసన చేపట్టారు.

జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ..

మంగళవారం విశాఖలో భారీగా వర్షం కురుస్తున్నప్పటికీ వైద్యులు తమ నిరసనను కొనసాగించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న యూజీసీ పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. బకాయిలు చెల్లించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని సంఘం నాయకులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి డాక్టర్ ఐ. బాబ్జి శ్యామ్ కుమార్ మాట్లాడుతూ.. బకాయిల చెల్లింపు అంశంపై 2022 నుంచి అధికారులు, ఆరోగ్య శాఖ మంత్రికి 30కి పైగా వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. బకాయిలు చెల్లించడం సాధ్యం కాదంటూ అధికారులు మెమో జారీ చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.

ఆగస్టు 21 నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన

తమ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 21 నుంచి ప్రభుత్వ వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారని బాబ్జి శ్యామ్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రతిరోజూ అరగంట పాటు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు, పాలిటెక్నిక్, వెటర్నరీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులతో పాటు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా యూజీసీ బకాయిలు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ వైద్యులకు సంబంధించిన బకాయిల విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ వైద్యులు అందిస్తున్న సేవలను గుర్తించి, తమ సమస్యను పరిష్కరించాలని డాక్టర్ బాబ్జి శ్యామ్ కుమార్ కోరారు. బకాయిలు చెల్లించే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్ర వైద్య కళాశాల ఆర్థోపెడిక్స్ విభాగం అధిపతి డాక్టర్ భవాని ప్రసాద్, పీడియాట్రిక్స్ విభాగం అధిపతి డాక్టర్ బీఎస్ చక్రవర్తి, ఆర్ఎంఓ బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement