మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / బుచ్చయ్యపేట SI పి. మనోజ్ కుమార్ నేతృత్వంలో 8 కిలోల గంజాయి స్వాధీనం
బుచ్చయ్యపేట SI పి. మనోజ్ కుమార్ నేతృత్వంలో 8 కిలోల గంజాయి స్వాధీనం
AP TODAY
AP TODAY

1 day ago

అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డాది వద్ద గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడి చేశారు. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని, అతని వద్ద నుంచి సుమారు 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.50 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం బీరం పంచాయతీకి చెందిన పొండే నాగరాజు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. జి.మాడుగుల ప్రాంతం నుంచి చోడవరం వైపు గంజాయిని తీసుకెళ్తుండగా వడ్డాది వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. గంజాయి రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై బుచ్చయ్యపేట పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరికి సరఫరా చేయడానికి తరలిస్తున్నారు, ఈ అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

– పి. మనోజ్ కుమార్, ఎస్ఐ, బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్

Published By : R V Satish Reddy
AP TODAY LIVE
Advertisement