హైదరాబాద్: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమిళ స్టార్ హీరో తలపతి విజయ్‌తో తనకు ఎదురైన ప్రత్యేక అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. తలపతి విజయ్‌ను కలిసిన అనంతరం ఆయనతో గడిపిన సమయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
విజయ్ దేవరకొండ తన పోస్ట్‌లో.. “ప్రియమైన తలపతి విజయ్ సర్‌తో ఎంతో అద్భుతమైన సమయాన్ని గడిపాను. చాలా ఆలస్యమైనప్పటికీ, ఆయన ఎంతో ప్రేమగా నన్ను ఆహ్వానించారు. జీవితానికి, పనికి, ప్రపంచానికి సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాలను నాతో పంచుకున్నారు. ఒక్క సమావేశంతోనే ఆయన నాకు మరింత ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారు” అని పేర్కొన్నారు.
అలాగే, మళ్లీ కలుసుకునే వరకు తన ప్రేమను, గౌరవాన్ని తెలియజేస్తూ విజయ్ దేవరకొండ ఈ పోస్ట్‌ను ముగించారు. ఈ సందేశం ద్వారా తలపతి విజయ్‌పై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేశారు.
ఇద్దరు స్టార్ హీరోలకు అభిమానులు భారీ సంఖ్యలో ఉండటంతో, విజయ్ దేవరకొండ చేసిన ఈ పోస్ట్ సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇద్దరు హీరోల మధ్య జరిగిన ఈ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.