మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / విశాఖలో డ్రగ్స్ కలకలం.. 50 గ్రాముల MDMA, లీటర్ లిక్విడ్ గంజాయి స్వాధీనం
విశాఖలో డ్రగ్స్ కలకలం.. 50 గ్రాముల MDMA, లీటర్ లిక్విడ్ గంజాయి స్వాధీనం
AP TODAY
AP TODAY

5 days ago

విశాఖపట్నం: విశాఖ నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయించేందుకు నగరంలోకి వచ్చినట్లు అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల MDMA, ఒక లీటర్ లిక్విడ్ గంజాయిను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం.. గాజువాక ప్రాంతం నుంచి డ్రగ్స్ విక్రయించేందుకు ఓ ముఠా నగరంలోకి వచ్చినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈస్ట్ పాయింట్ కాలనీలో నిఘా ఏర్పాటు చేశారు. అనుమానితుల కదలికలను గమనించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారి వద్ద తనిఖీలు నిర్వహించగా 50 గ్రాముల MDMAతో పాటు ఒక లీటర్ లిక్విడ్ గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం త్రీ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం త్రీ టౌన్ పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ సరఫరా వెనుక ఎవరెవరు ఉన్నారు? వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి అందుతున్నాయి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డ్రగ్స్ ముఠాకు సంబంధించిన లింకులపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిందితుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement