మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / విశాఖలో ఘనంగా వరల్డ్ సైట్ డే.. దృష్టి సమస్యలపై అవగాహన ర్యాలీ
విశాఖలో ఘనంగా వరల్డ్ సైట్ డే.. దృష్టి సమస్యలపై అవగాహన ర్యాలీ
AP TODAY
AP TODAY

5 days ago

విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ సైట్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు, విద్యార్థులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు కంటి ఆరోగ్యం, దృష్టి సమస్యలపై అవగాహన కల్పించారు.

కంటి ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, దృష్టిలోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకునేలా అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కే. పద్మజ, ఆసుపత్రి జీఎం ప్రదీప్, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్నట్లుగా మనిషి జీవితంలో కళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ముఖ్యంగా దృష్టిలోపాలు, కంటి సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. వయసుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా పలు సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని తెలిపారు.

అవసరమైన వారు వైద్యుల సూచనల మేరకు మందులు ఉపయోగించాలని, కంటి సమస్యలు ఉన్నప్పుడు స్వయంగా మందులు వాడకుండా నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు, యువతలో పెరుగుతున్న స్క్రీన్ వినియోగం నేపథ్యంలో కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని వైద్యులు పేర్కొన్నారు.

వరల్డ్ సైట్ డే సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీ ద్వారా ప్రజలకు కంటి ఆరోగ్యంపై పలు ముఖ్యమైన సూచనలు అందించారు. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు పొందడం ద్వారా దృష్టిని కాపాడుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement