కదిరి, సెప్టెంబర్ 18: జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ శుక్రవారం కదిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌కు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వెండిదండి శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర, స్వామివారి విశిష్టత, ఆలయ ప్రాశస్త్యం గురించి ఎమ్మెల్యేకు వివరించారు.
దర్శనం అనంతరం ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యత గురించి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి కూడా వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కదిరి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ భైరవ ప్రసాద్, పార్టీ నాయకులు కుట్టాల లక్ష్మణ, రాజేంద్ర, బసెట్టి శ్రీనివాసులు, తుమ్మల రవీంద్ర, ఇర్ఫాన్, రామ్మోహన్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.