అమరావతి, అక్టోబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 252 జారీ చేసింది. మొత్తం 17 స్థానాల్లో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు ఐదు, జనరల్ మహిళలకు ఐదు, అన్‌రిజర్వుడ్ కేటగిరీలో నాలుగు స్థానాలను కేటాయించారు.
రిజర్వేషన్ల ప్రకారం
17 మున్సిపల్ కార్పొరేషన్ల రిజర్వేషన్ల వివరాలు
-
మంగళగిరి–తాడేపల్లి – ఎస్టీ జనరల్
-
కర్నూలు – ఎస్సీ మహిళ
-
రాజమహేంద్రవరం – ఎస్సీ జనరల్
-
కాకినాడ – బీసీ మహిళ
-
మచిలీపట్నం – బీసీ మహిళ
-
ఏలూరు – బీసీ జనరల్
-
అనంతపురం – బీసీ జనరల్
-
చిత్తూరు – బీసీ జనరల్
-
విజయనగరం – జనరల్ మహిళ
-
శ్రీకాకుళం – జనరల్ మహిళ
-
గుంటూరు – జనరల్ మహిళ
-
కడప – జనరల్ మహిళ
-
విశాఖపట్నం (జీవీఎంసీ) – జనరల్ మహిళ
-
తిరుపతి – అన్‌రిజర్వుడ్
-
విజయవాడ – అన్‌రిజర్వుడ్
-
ఒంగోలు – అన్‌రిజర్వుడ్
-
నెల్లూరు – అన్‌రిజర్వుడ్
రిజర్వేషన్ల ఖరారుతో మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో కసరత్తు ప్రారంభం కానుంది. ఎన్నికల తేదీలు, ఇతర వివరాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రకటన వెలువడాల్సి ఉంది.