బుధవారం, 14 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
గుంటూరు మేయర్ అభ్యర్థి రేసులో మాదల మీనా రత్న పేరు!
భోగాపురంలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. నూతన వధూవరులకు ఆశీస్సులు!
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్!
బొల్లాపల్లి ZPTC రేసులో పోక వెంకటరావు.. సేవా కార్యక్రమాలే ఆయన బలం!
మున్సిపల్ రిజర్వేషన్‌తో హుటాహుటిన పెళ్లి.. చైర్‌పర్సన్ పదవిపై కన్ను!
అనకాపల్లి జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. రేసులో నలుగురు మహిళా నేతలు!
చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారి అలంకరణ.. ఘనంగా ప్రత్యేక పూజలు!
15 ఏళ్లలో 10 వేలకుపైగా బుర్రకథలు.. జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి!
పసుపు రైతులకు పండగే.. దుగ్గిరాల మార్కెట్‌లో క్వింటా రూ.18,400!
విశాఖలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి!
నేడు జనసేనలోకి వంగవీటి రాధా? పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికపై ఉత్కంఠ!
‘ఉక్రెయిన్‌కు ఇది నమ్మక ద్రోహమే’.. ట్రంప్‌పై అమెరికా సెనేటర్ల ఫైర్!
నాలుగోసారి కూడా కాంగ్రెస్ ఓటమి ఖాయం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
నన్ను జైలుకు పంపిన వ్యక్తిని లోపలేసింది ఎవరో తెలుసుగా.. వల్లభనేని వంశీ వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ సత్యనారాయణమూర్తి
AP TODAY / 12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
AP TODAY
AP TODAY

1 day ago

అమరావతి, అక్టోబర్ 12: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఏపీ సచివాలయంలో ఆయన పీఆర్సీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.

1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన దినేష్ కుమార్ గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ నెల 1వ తేదీన ఆయనను 12వ వేతన సవరణ సంఘం చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 200 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఏడాదిలోగా పీఆర్సీ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దినేష్ కుమార్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించడంతో పాటు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి పూర్తి వివరాలను తీసుకుని అధ్యయనం చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన అంశాలపై సమగ్ర నివేదికను నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

పీఆర్సీ చైర్మన్‌కు అధికారుల శుభాకాంక్షలు

దినేష్ కుమార్ పీఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్ చంద్, అదనపు కార్యదర్శి గౌతమ్ అల్లాడ కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. దుశ్శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.

12వ పీఆర్సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించిన అంశాలపై తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే వేతనాల పెంపు శాతం, అమలు తేదీ, ఇతర ప్రయోజనాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే కీలకం.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement