మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
AP TODAY
AP TODAY

1 hour ago

ఆలమూరు : కోనసీమ జిల్లా ఆలమూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్‌లో గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏల) సంఘం చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 28వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు ట్రెజరర్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార గ్రహీత డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు తెలిపారు.

సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆయన వీఆర్ఏలతో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి

ఈ సందర్భంగా డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో వీఆర్ఏలకు అందుతున్న నెలవారీ రూ.10,500 వేతనం ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న కుటుంబాలు ఈ జీతంతో జీవనం సాగించడం చాలా కష్టమని పేర్కొన్నారు.

వీఆర్ఏలు కోరుతున్న విధంగా తెలంగాణలో అమలవుతున్న పే స్కేళ్లను ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. వీఆర్ఏలకు కనీసం నెలకు రూ.30 వేల వేతనం అందించాలని డిమాండ్ చేశారు. 28 రోజులుగా సమ్మె చేస్తున్న వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వారి డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

సమ్మెలో పాల్గొన్న వీఆర్ఏ సంఘం నాయకులు

ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు తాతపూడి ఇషాక్, కార్యదర్శి కంతేటి శివరామారావు, ఉపాధ్యక్షుడు భువనగిరి ఏసు, సలహాదారు గూనపల్లి నాగేశ్వరరావు, కోశాధికారి కుందేటి శ్రీను పాల్గొన్నారు.

అలాగే సభ్యులు యార్లగడ్డ జీవరత్నం, ఏడిద వెంకటాద్రి, బూరీగ మంగలక్ష్మి, చోడవరపు రామలక్ష్మి, కోట లక్ష్మి, షేక్ బషీర్ బీబీ, రొక్కాల దొరబాబుతో పాటు మండలంలోని పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement