మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY
AP TODAY

11 hours ago

విశాఖపట్నం: భారత నౌకాదళానికి చెందిన నౌకల సమాచారాన్ని విదేశాలకు చేరవేస్తున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో రెండో నిందితుడిని మల్కాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కడారి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విశాఖపట్నం తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసుల ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

2025లో నమోదైన కేసు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2025లో నేవీ నౌకలకు సంబంధించిన సమాచారాన్ని విదేశాలకు చేరవేస్తున్నారనే ఆరోపణలపై మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో మల్కాపురానికి చెందిన బొంగు రవి, కడారి శ్రీనివాసరావులను నిందితులుగా చేర్చారు. అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి బొంగు రవిని అప్పట్లోనే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

దుబాయ్‌కు వెళ్లి.. ఢిల్లీలో పట్టుబడ్డ రెండో నిందితుడు

ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న కడారి శ్రీనివాసరావు దుబాయ్‌కు వెళ్లి పోలీసులకు చిక్కకుండా ఉన్నట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. తాజాగా దుబాయ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను పక్కా సమాచారంతో మల్కాపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

అనంతరం ఆయనను విశాఖపట్నానికి తీసుకువచ్చి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

కేసుపై కొనసాగనున్న దర్యాప్తు

నేవీ నౌకలకు సంబంధించిన సమాచారం విదేశాలకు చేరిందనే ఆరోపణలు రక్షణ భద్రతకు సంబంధించిన కీలక అంశం కావడంతో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఏ రకమైన సమాచారం బయటకు వెళ్లిందనే వివరాలు, దాని వెనుక ఉన్న ఇతర వ్యక్తుల పాత్ర వంటి అంశాలపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement