ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న “ఛాత్రోంకి గూంజ్ – విద్యార్థి గర్జన” కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ యువజన నాయకులు ఢిల్లీ చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ తేజ నాయుడు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పగడాల, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కట్ట జవహర్ బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు కొరివి అజయ్ తదితర నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు.
విద్యార్థుల సమస్యలు, వారి హక్కులు, యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై తమ గళాన్ని వినిపించేందుకు ఈ కార్యక్రమం వేదిక కానుంది.