మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / ఉరవకొండలో ఆగని పందుల స్వైరవిహారం
ఉరవకొండలో ఆగని పందుల స్వైరవిహారం
AP TODAY
AP TODAY

September 4, 2026

ఉరవకొండ రూరల్ (aptoday)  : పట్టణంలోని డ్రైవర్ కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, చౌడేశ్వరి కాలనీ,  ప్రాంతాల్లో పందుల స్వైరవిహారం రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల పక్కన, మురుగు కాలువల వద్ద, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తకుప్పల్లో పందులు గుంపులుగా సంచరిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఉదయం, సాయంత్రం వేళల్లో పందులు ప్రధాన రహదారులపైకి రావడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు పాఠశాలలకు వెళ్లే సమయంలో, మహిళలు, వృద్ధులు రాకపోకలు సాగించే వేళ భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే పలుచోట్ల పందులు వాహనాలకు అడ్డుగా రావడంతో ప్రమాదాలు తృటిలో తప్పిన ఘటనలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు.

కాలనీల్లో చెత్తను సకాలంలో తొలగించకపోవడం, మురుగు కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో పందుల సంఖ్య పెరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దోమలు, ఈగలు అధికమై డెంగీ, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక చర్యలు చేపట్టి పందుల సంచారాన్ని అరికట్టడంతో పాటు చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని డ్రైవర్ కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, చౌడేశ్వరి కాలనీ, ఇందిరానగర్ వాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement