మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / ఆ షాపులంటే అధికారులకు అమిత ప్రేమా?
ఆ షాపులంటే అధికారులకు అమిత ప్రేమా?
AP TODAY
AP TODAY

September 22, 2026

అడ్డగోలుగా ఫుట్‌పాత్‌లపై దుకాణాలు.. పేదల పేరుతో అద్దె వసూళ్ల ఆరోపణలు

ఆర్కే బీచ్ పరిసరాల్లో అక్రమ దుకాణాలపై విమర్శలు

విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్ పరిసరాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న దుకాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తోపుడు బండ్లు, చక్రాల బల్లలు వంటి వాటిపై చిన్న వ్యాపారాలకు అనుమతులు ఉన్నప్పటికీ.. వాటి పేరుతో పెద్దస్థాయిలో దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పాండురంగాపురం వద్ద భారీ పాన్ షాప్

పాండురంగాపురం ప్రాంతంలో వైజాగ్ గెస్ట్ హౌస్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై కొనసాగుతున్న ఓ పాన్ షాప్‌పై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాన్ షాప్ పేరుతో రోడ్డుపైనే రెండు పెద్ద ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయడంతో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.

రాత్రి 10 గంటల తర్వాత ఈ ప్రాంతంలో కొందరు వ్యక్తులు గుమిగూడుతున్నారని, గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగంతో పాటు అసభ్యకర ప్రవర్తన జరుగుతోందని స్థానికుల ఆరోపణ. రోడ్డుపై వాహనాలు నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదాల ప్రమాదం కూడా ఉందని వారు అంటున్నారు.

కార్పొరేషన్ స్థలానికి అద్దె?

ఈ తరహా దుకాణాల విషయంలో మరో కీలకమైన ఆరోపణ తెరపైకి వస్తోంది. ఒకరి పేరుతో లేదా ఒకరి ఆధీనంలో ఉన్న దుకాణాలను మరొకరు అద్దెకు తీసుకుని వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement