హైదరాబాద్: కామెడీ సినిమాలకు పేరుగాంచిన అల్లరి నరేష్ నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా దాదాపు మూడు వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల నిర్మించారు. రాశి సింగ్, ప్రిషా సింగ్, విష్ణుప్రియ, సురభి, వీకే నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Amazon Prime Videoలో సెప్టెంబర్ 25 నుంచి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు భాషతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉన్నట్లు సమాచారం.