మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / అనకాపల్లిలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్
అనకాపల్లిలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్
AP TODAY
AP TODAY

October 6, 2026

అనకాపల్లి, అక్టోబర్ 6: అనకాపల్లి పట్టణంలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రెండు చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించిన సుమారు 4.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు అనకాపల్లి టౌన్ సీఐ జి. ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ ఎ. వెంకటేశ్వరరావు, క్రైమ్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితులను గుర్తించారు.

నిందితులు వీరే..

ప్రధాన నిందితుడు మహేందర్ సింగ్ అలియాస్ మహేంద్ర (40) రాజస్థాన్‌కు చెందినవాడు. ప్రస్తుతం విశాఖపట్నం మధురవాడలో నివసిస్తూ రాపిడో బైక్ రైడర్‌గా పనిచేస్తున్నాడు. మరో నిందితురాలు మండ్రు లత రత్నాకర్ (52) మధురవాడకు చెందినది.

మహేందర్ సింగ్ గతంలో కూడా నేరాలకు పాల్పడిన పాత నేరస్థుడని పోలీసులు తెలిపారు. 2013–2015 మధ్య హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ ప్రాంతాల్లో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని సుమారు 36 బంగారు గొలుసుల స్నాచింగ్‌లకు పాల్పడినట్లు వెల్లడించారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత విశాఖలో ఉంటూ అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేసేవాడని పోలీసులు తెలిపారు. హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చి మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్లేవాడని పేర్కొన్నారు.

అనకాపల్లిలో రెండు చైన్ స్నాచింగ్‌లు

ఈ ఏడాది మే 22న అనకాపల్లి బొడ్డేడువారి వీధిలో విశ్వనాథ నాగరత్నం అనే మహిళ నుంచి 1.5 తులాల బంగారు గొలుసును, అదే రోజు గాంధీనగర్‌లో పల్లా సత్యవతి అనే వృద్ధురాలి మెడ నుంచి 3 పేటల బంగారు గొలుసును నిందితుడు అపహరించినట్లు పోలీసులు తెలిపారు.

చోరీ చేసిన బంగారాన్ని మహేందర్ సింగ్.. A-2 లత రత్నాకర్‌కు ఇచ్చేవాడని, ఆమెకు పరిచయమున్న నగల దుకాణాల్లో విక్రయించి వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకునేవారని పోలీసులు వెల్లడించారు.

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, అనకాపల్లి టౌన్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. లత రత్నాకర్ వద్ద నుంచి రెండు కేసులకు సంబంధించిన 4.5 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు.

కేసును ఛేదించి సొత్తును రికవరీ చేసిన సీఐ ప్రేమ్ కుమార్, ఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ జి. గాంధీ, కానిస్టేబుళ్లు ఎం. సముద్రం, ఆర్.పి. నాయుడు, టి.ఎస్. నాయుడులను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement