రోడ్లు, పార్కులు, వీధి దీపాల అభివృద్ధికి నిధులు.. డ్రైనేజీ పనులకు మరో రూ.160 కోట్లు
అనంతపురం: అనంతపురం నగరంలో రూ.50 కోట్ల విలువైన పట్టణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా రూ.11,360 కోట్ల విలువైన మున్సిపల్ ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా అనంతపురంలోనూ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ నిధులతో రోడ్లు, పార్కులు, వీధి దీపాలు తదితర పట్టణ మౌలిక వసతులను మెరుగుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. అదనంగా రూ.160 కోట్లతో డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.