అయిచి–నగోయా, సెప్టెంబర్ 23:
2026 ఏషియన్ గేమ్స్‌లో బుధవారం భారత క్రీడాకారులకు కీలక పోటీలు ఉన్నాయి. షూటింగ్‌లో మను భాకర్, వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను సహా పలువురు భారత అథ్లెట్లు వివిధ విభాగాల్లో బరిలోకి దిగుతున్నారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ క్వాలిఫికేషన్‌లో మను భాకర్ పాల్గొంటున్నారు. వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఉదయం 9 గంటలకు ఫైనల్‌లో పోటీ పడనున్నారు.
మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్‌లో మీరాబాయి చాను పాల్గొంటున్నారు. ఈ పోటీ ఉదయం 10 గంటలకు జరగనుంది.
అదే రోజు భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చైనాతో సెమీఫైనల్లో తలపడనుంది. హాకీ, కబడ్డీ, రోయింగ్, వుషు, స్విమ్మింగ్, స్క్వాష్ తదితర విభాగాల్లోనూ భారత క్రీడాకారులు పోటీపడుతున్నారు.