చెన్నై: తమిళ స్టార్ హీరో ధనుష్ మరోసారి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ధనుష్–నాగవంశీ కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త సినిమాకు సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది.
ప్రస్తుతం D56 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ చిత్రానికి తమిజరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించనున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో నటుడు ఎస్.జే. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ఈ సినిమా గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 25న మదురైలో జరగనుందని, ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం పేర్కొంది.