మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / మాధురి రాథోడ్ ఫిర్యాదు.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఈశ్వర్ సాయి
మాధురి రాథోడ్ ఫిర్యాదు.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఈశ్వర్ సాయి
AP TODAY
AP TODAY

September 1, 2026

హైదరాబాద్: ఫోక్ ఆర్టిస్టులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన Crime No.1559/2026 కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈశ్వర్ సాయి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

ఈశ్వర్ సాయి తరఫున హైకోర్టు న్యాయవాది నాగూర్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో BNS సెక్షన్ 69 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

FIRలోని వివరాల ప్రకారం.. ఈశ్వర్ సాయి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధాలు కొనసాగించారని, అనంతరం వివాహానికి నిరాకరించారని మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఫిర్యాదులో పేర్కొన్న మరో అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈశ్వర్ సాయి ఇప్పటికే వివాహితుడని, తన భార్యకు విడాకులు ఇస్తానని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే వివాహితుడైన వ్యక్తి భవిష్యత్తులో వివాహం చేసుకుంటానని ఇచ్చిన హామీకి సంబంధించిన ఆరోపణలను కోర్టు ఏ విధంగా పరిశీలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఈశ్వర్ సాయి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు, కోర్టు తదుపరి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

గమనిక: కేసులోని ఆరోపణలు కోర్టులో నిరూపితం కావాల్సి ఉంది. తుది న్యాయ నిర్ణయం వెలువడే వరకు ఆరోపణలను నిర్ధారిత వాస్తవాలుగా పరిగణించరాదు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement