రష్యా, జర్మనీ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని జర్మనీ విదేశీ నిఘా సంస్థ BND అధిపతి మార్టిన్ జేగర్ హెచ్చరించారు. రష్యా నుంచి పెరుగుతున్న ‘షాడో వార్’ కార్యకలాపాలు యూరప్‌కు ముప్పుగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
రష్యా ప్రస్తుతం సంప్రదాయ సైనిక చర్యలకు మాత్రమే పరిమితం కాకుండా సైబర్ దాడులు, విధ్వంసక చర్యలు, రాజకీయ జోక్యం వంటి హైబ్రిడ్ కార్యకలాపాలకు పాల్పడుతోందని జర్మనీ నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇలాంటి చర్యలు కొనసాగితే భవిష్యత్తులో రష్యా–జర్మనీ మధ్య ప్రత్యక్ష హింసాత్మక ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని జర్మనీ నిఘా అధికారి హెచ్చరించారు. యూరప్ దేశాలు రష్యా చర్యలను అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నాయి.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే యూరప్‌లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. డ్రోన్లు, సైబర్ దాడులు, గూఢచర్యం, కీలక మౌలిక సదుపాయాలపై దాడుల ముప్పుపై యూరోపియన్ దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి.