భారత్ సెమీకండక్టర్ రంగంలో కీలక దశలోకి ప్రవేశించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
SEMICON India 2026 కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. భారత్ సెమీకండక్టర్ ప్రయాణం తొలి దశను దాటి వాణిజ్య స్థాయిలో చిప్ ఉత్పత్తి దిశగా తదుపరి దశలోకి అడుగుపెడుతోందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా నమ్మదగిన సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థ అవసరం పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ఈ రంగంలో తన సామర్థ్యాలను పెంచుకోవాలని ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
చిప్ తయారీ, డిజైన్, ప్యాకేజింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు, సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా భారత్ గ్లోబల్ సెమీకండక్టర్ సరఫరా గొలుసులో మరింత కీలక పాత్ర పోషించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.