మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / మంత్రి కొండా సురేఖకు షాక్‌? ఫ్లెక్సీలో ఫొటో మిస్సింగ్‌.. కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌!
మంత్రి కొండా సురేఖకు షాక్‌? ఫ్లెక్సీలో ఫొటో మిస్సింగ్‌.. కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌!
AP TODAY
AP TODAY

September 1, 2026

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయనే ప్రచారం కొనసాగుతున్న వేళ.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఫొటో, పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

కేసముద్రంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం మునిసిపాలిటీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. బహిరంగ సభలో ప్రసంగించారు.

ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఫొటోలు ఉన్నాయి. అంతేకాదు.. బీఆర్ఎస్‌కు చెందిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఫొటోలు కూడా ఫ్లెక్సీలో కనిపించాయి.

కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ఫొటో మాత్రం కనిపించలేదు. అంతేకాదు.. శంకుస్థాపన శిలాఫలకంపై కూడా ఆమె పేరు లేకపోవడం చర్చకు దారితీసింది.

మరోవైపు ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటికే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంత ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె ఫొటో, పేరు లేకపోవడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చిందనే చర్చ జరుగుతోంది.

అయితే ఫ్లెక్సీలో ఫొటో, పేరు లేకపోవడానికి అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. మంత్రివర్గ మార్పులపై కూడా ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

దీంతో కేసముద్రం ఫ్లెక్సీ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement