కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బందరు పోర్టు పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బందరు పోర్టు ముడా పరిధిలోని భూములను పరిశీలించింది. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించి వివరాలు సేకరించింది.
ఈ సందర్భంగా బందరు ఆర్డీఓ సాంబశివరావు మాట్లాడుతూ.. బందరు పోర్టు రెండో దశ విస్తరణలో భాగంగా ప్రభుత్వం 1,400 ఎకరాలను కేటాయించిందని తెలిపారు. పోర్టు కోసం సేకరించిన భూముల్లో అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భూముల్లో అనుమతులు లేకుండా ఎలాంటి తవ్వకాలు జరగకుండా పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మైనింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు చేసేందుకు అధికారుల ఫోన్ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనుమతులు లేకుండా మైనింగ్ కార్యకలాపాల్లో పాల్గొనే వాహనాలను సీజ్ చేస్తామని ఆర్డీఓ హెచ్చరించారు.