మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / అర్హులైన ప్రతి దరఖాస్తును సకాలంలో ఆమోదించాలి: కలెక్టర్‌
అర్హులైన ప్రతి దరఖాస్తును సకాలంలో ఆమోదించాలి: కలెక్టర్‌
AP TODAY
AP TODAY

September 18, 2026

 

అర్హులైన ప్రతి దరఖాస్తును గడువులోగా అప్రూవ్‌ చేయాలి..డబ్బులు డిమాండ్‌ చేస్తే కఠిన చర్యలు

మొక్కలు నాటి సంరక్షించాలి..పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్‌ లక్ష్మీశ

విజయవాడ/చందర్లపాడు, సెప్టెంబర్‌ 18: ప్రజా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ సూచించారు. నూతన పింఛన్‌ దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా అర్హత కలిగిన ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లో అప్రూవ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నూతన పింఛన్‌ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఆన్‌లైన్‌ అప్రూవల్‌ ప్రక్రియపై శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. సెప్టెంబర్‌ 18తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి అర్హులైన వారికి పింఛన్‌ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడు అనవసర కారణాలతో పింఛన్‌ ప్రయోజనం కోల్పోకుండా చూడాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిష్కారం లేదా ఆన్‌లైన్‌ అప్రూవల్‌ కోసం లబ్ధిదారుల నుంచి ఎలాంటి రుసుములు, డబ్బులు డిమాండ్‌ చేయరాదని హెచ్చరించారు. డబ్బులు ఆశించడం, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, అధికారిక ప్రక్రియను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించడం వంటి చర్యలు నిర్ధారణ అయితే సంబంధిత సిబ్బందిపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది పనితీరును ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు. దరఖాస్తుల పురోగతి, అర్హత నిర్ధారణ, పెండింగ్‌ అంశాలు, ఆన్‌లైన్‌ అప్రూవల్‌ తదితర అంశాలను క్రమం తప్పకుండా సమీక్షించాలని సూచించారు.

ఇదిలా ఉండగా.. ‘నెట్‌ జీరో–ఆరోగ్యకరమైన క్యాంపస్‌’ కార్యక్రమంలో భాగంగా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలోని గురుకుల పాఠశాలలో ‘అనంత ఆరణ్య ప్లాంటేషన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పచ్చదనం పెంపుతో విద్యార్థులకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని కలెక్టర్‌ తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి వృక్షంగా ఎదిగేలా చూడాలని సూచించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

అనంతరం ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా చందర్లపాడు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ‘పరిశుభ్రమైన గ్రామం–పచ్చని గ్రామం’ అనే సందేశంతో అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, మొక్కలు నాటి సంరక్షించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా సంక్షేమ పథకాల అమలులోనూ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

కార్యక్రమాల్లో నందిగామ ఆర్డీవో గడ్డిపాటి అనిల్‌ కుమార్‌, డీపీవో సీతా మహాలక్ష్మి, తహసీల్దార్‌ వాసిరెడ్డి రామకోటేశ్వరరావు, సంబంధిత అధికారులు, సిబ్బంది, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

Published By : R V Satish Reddy
AP TODAY LIVE
Advertisement