తెలంగాణ: అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు వరుసగా ఇద్దరు మహిళా అధికారులు పట్టుబడ్డారు. వేర్వేరు ఘటనల్లో లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
గోల్కొండ జోన్‌లో రూ.4 లక్షలు తీసుకుంటూ..
GHMC గోల్కొండ జోన్ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ T. సునీత భవన నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తిని రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ACB అధికారులు తెలిపారు. చివరకు రూ.8 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా ACB అధికారులు దాడి చేసి ఆమెను పట్టుకున్నారు.
ఫిజియోథెరపీ సెంటర్ తెరిచేందుకు రూ.లక్ష..
మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా DM&HO స్వర్ణ కుమారి లంచం తీసుకుంటూ ACBకి చిక్కారు. మూతపడిన ఓ ఫిజియోథెరపీ సెంటర్‌ను తిరిగి తెరవడానికి అనుమతి ఇచ్చేందుకు రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. లంచం తీసుకుంటుండగా ACB అధికారులు ఆమెను పట్టుకున్నారు.
ఒకే రోజు ఇద్దరు మహిళా అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడటం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు ఘటనలకు సంబంధించి ACB అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.