మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / భక్తుల భద్రతకు రూ.2 లక్షల బీమా.. తిరుమలలో కొత్త సౌకర్యాలు
భక్తుల భద్రతకు రూ.2 లక్షల బీమా.. తిరుమలలో కొత్త సౌకర్యాలు
AP TODAY
AP TODAY

September 17, 2026

తిరుమల: తిరుమలకు వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందులో భాగంగా తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఎల్‌ఐసీతో కలిసి ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ బీమా విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.

తిరుమలలో బుధవారం పలు భక్తి, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆధునికీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను ప్రారంభించారు. 1998లో ప్రారంభమైన ఈ మ్యూజియాన్ని ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరించారు.

శ్రీవారి చరిత్రను తెలియజేసేలా మ్యూజియం

శ్రీవారి చరిత్ర, తిరుమల ఆలయ సంప్రదాయాలు, కళా సంపద, ఆధ్యాత్మిక విశేషాలను భక్తులకు సులభంగా అర్థమయ్యేలా మ్యూజియాన్ని రూపొందించారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో 14 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు.

మ్యూజియంలో 8,000కు పైగా ప్రదర్శన వస్తువులు అందుబాటులో ఉంచారు. శ్రీవారి ఆభరణాలు, ఆలయ కళా సంపద, శిల్పాలు, అరుదైన నాణేలు, అన్నమయ్య రాగి రేకులు, పూజా సామగ్రి, సంగీత వాయిద్యాలు, వేదాలు, ఆలయ నిర్మాణ విశేషాలు తదితర అంశాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. హోలోగ్రాఫిక్ డిస్‌ప్లేలు, 360 డిగ్రీల సౌండ్, ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్‌ప్లేల వంటి సాంకేతికతను వినియోగించారు.

భక్తులకు రూ.2 లక్షల బీమా

తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో రూ.2 లక్షల బీమా సౌకర్యం తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుమలలో ప్రమాదవశాత్తు భక్తుడు మరణించిన సందర్భంలో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందేలా ఈ బీమా విధానాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు.

32 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

భక్తుల ఉచిత రవాణా సౌకర్యాలను పెంచేందుకు తిరుమలలో 32 ఎలక్ట్రిక్ బస్సులను కూడా సీఎం ప్రారంభించారు. వీటితో తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య 18 నుంచి 50కి, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 14 నుంచి 44కి పెరగనుంది.

భక్తుల సౌకర్యాలు, భద్రత, ఆధ్యాత్మిక అనుభూతితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తూ తిరుమలను మరింత ఆధునికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement