మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / వడ్డాది వద్ద రోడ్డు ప్రమాదం.. ఆర్ఎంపీ డాక్టర్ అమిత్ కుమార్ మృతి
వడ్డాది వద్ద రోడ్డు ప్రమాదం.. ఆర్ఎంపీ డాక్టర్ అమిత్ కుమార్ మృతి
AP TODAY
AP TODAY

1 day ago

అనకాపల్లి జిల్లా, చోడవరం:అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని బుచ్చయ్యపేట మండలం వడ్డాది వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విజయరామరాజుపేట గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ దొడ్డి అమిత్ కుమార్ (40) మృతి చెందారు.

వడ్డాదిలో ఓ పేషెంట్‌కు వైద్యం అందించి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, మయూరి దాబా సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అమిత్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఆర్ఎంపీగా స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ అమిత్ కుమార్ మంచి గుర్తింపు పొందారు. అర్ధరాత్రి సైతం ఎవరైనా వైద్యం కోసం ఫోన్ చేస్తే వెంటనే స్పందించి సేవలందించేవారని స్థానికులు తెలిపారు. ఆయన మృతితో విజయరామరాజుపేట గ్రామంలో విషాదం నెలకొంది.

మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమిత్ కుమార్‌ను కడసారి చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ ఘటనపై బుచ్చయ్యపేట ఎస్సై మనోజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published By : R V Satish Reddy
AP TODAY LIVE
Advertisement