మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / ఒక్క క్షణం.. శాశ్వత జ్ఞాపకం.. ఫొటోగ్రాఫర్లకు కలెక్టర్‌ ప్రశంసలు
ఒక్క క్షణం.. శాశ్వత జ్ఞాపకం.. ఫొటోగ్రాఫర్లకు కలెక్టర్‌ ప్రశంసలు
AP TODAY
AP TODAY

September 18, 2026

విజయవాడ: ఒక క్షణాన్ని కెమెరాలో బంధించి, దాన్ని శాశ్వత జ్ఞాపకంగా నిలిపే శక్తి ఫొటోగ్రాఫర్లకు ఉందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు. ఒక క్షణంలోని భావోద్వేగాన్ని, సంఘటనను, చరిత్రను శాశ్వతంగా బంధించి భావితరాలకు అందించే అద్భుతమైన కళ ఫొటోగ్రఫీ అని పేర్కొన్నారు.

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతలకు శుక్రవారం కలెక్టరేట్‌లో బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, యువత, పీ4, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం, ఉత్తమ న్యూస్‌ పిక్చర్స్‌ తదితర విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు.

ఈ పోటీలకు మొత్తం 221 ఛాయాచిత్రాల ఎంట్రీలు వచ్చాయి. వాటిలో జ్యూరీ సభ్యులు 27 ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపిక చేశారు. ఆగస్టు 19న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అతిథులతో కలిసి విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.

వ్యక్తిగత కారణాలతో ఆ కార్యక్రమానికి హాజరై బహుమతులు అందుకోలేకపోయిన విజేతలతో పాటు పోటీల్లో పాల్గొన్న వారికి శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక పరిణామాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలను తమ కెమెరా కళ్లతో ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఫొటో జర్నలిస్టుల సేవలు అభినందనీయమని అన్నారు.

వార్తా కథనానికి దృశ్యరూపాన్ని అందించడం ద్వారా ప్రజలకు ఒక విషయాన్ని మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేయడంలో ఫొటో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఒక మంచి ఫొటో ఒక సంఘటనను మాటలకంటే బలంగా ప్రజలకు చేరవేయగలదని పేర్కొన్నారు. ఫొటోగ్రఫీ వంటి గొప్ప కళను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్‌ అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఐపీఆర్‌వో కేవీ రమణరావు, డీపీఆర్‌వో టి. నాగేశ్వరరావు, డివిజనల్‌ పీఆర్‌వో కె. రవి, ఫొటోగ్రఫీ పోటీల సమన్వయకర్త వీవీ ప్రసాద్‌, జ్యూరీ సభ్యులు, సీనియర్‌ ఫొటో జర్నలిస్ట్‌ సీహెచ్‌. విజయభాస్కర్‌, ఫొటో జర్నలిస్టులు కేవీఎస్‌ గిరి, జీవీ నారాయణ, టీవీ రమణ, ఎస్‌. నాగభూషణం, సీహెచ్‌. వెంకట్రామయ్య, ఎ. శ్రీనివాసమూర్తి, శ్రీనివాసరావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ వారిని సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు.

సమాచార, పౌర సంబంధాల శాఖ, ఎన్టీఆర్‌ జిల్లా ద్వారా జారీ.

Published By : R V Satish Reddy
AP TODAY LIVE
Advertisement