బుధవారం, 14 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
గుంటూరు మేయర్ అభ్యర్థి రేసులో మాదల మీనా రత్న పేరు!
భోగాపురంలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. నూతన వధూవరులకు ఆశీస్సులు!
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్!
బొల్లాపల్లి ZPTC రేసులో పోక వెంకటరావు.. సేవా కార్యక్రమాలే ఆయన బలం!
మున్సిపల్ రిజర్వేషన్‌తో హుటాహుటిన పెళ్లి.. చైర్‌పర్సన్ పదవిపై కన్ను!
అనకాపల్లి జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. రేసులో నలుగురు మహిళా నేతలు!
చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారి అలంకరణ.. ఘనంగా ప్రత్యేక పూజలు!
15 ఏళ్లలో 10 వేలకుపైగా బుర్రకథలు.. జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి!
పసుపు రైతులకు పండగే.. దుగ్గిరాల మార్కెట్‌లో క్వింటా రూ.18,400!
విశాఖలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి!
నేడు జనసేనలోకి వంగవీటి రాధా? పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికపై ఉత్కంఠ!
‘ఉక్రెయిన్‌కు ఇది నమ్మక ద్రోహమే’.. ట్రంప్‌పై అమెరికా సెనేటర్ల ఫైర్!
నాలుగోసారి కూడా కాంగ్రెస్ ఓటమి ఖాయం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
నన్ను జైలుకు పంపిన వ్యక్తిని లోపలేసింది ఎవరో తెలుసుగా.. వల్లభనేని వంశీ వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ సత్యనారాయణమూర్తి
AP TODAY / కొడాలి నాని సమక్షంలో ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు (రాము) చేరిక
కొడాలి నాని సమక్షంలో ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు (రాము) చేరిక
AP TODAY
AP TODAY

September 18, 2026

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు జరిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు (రాము) మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొడాలి నాని సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర గ్రామానికి చెందిన పలువురు యువకులు వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులతో పాటు అనేక వర్గాలను విస్మరించిందని ఆరోపించారు. బీజేపీ ఆశీస్సులతోనే తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా కాకుండా కేవలం కొన్ని వర్గాల ప్రయోజనాలకే పరిమితమై ప్రభుత్వం పనిచేస్తోందని కొడాలి నాని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినా, విమర్శించినా అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల బలం, అధికార బలాన్ని ఉపయోగించి గెలిచేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొడాలి నాని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీలో చురుకుగా పనిచేసే నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతూ వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడుతూ వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచే ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.

ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు (రాము)తో పాటు పెంజండ్ర గ్రామ యువత వైఎస్సార్‌సీపీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని స్థానిక పార్టీ నాయకులు పేర్కొన్నారు.

Published By : R V Satish Reddy
AP TODAY LIVE
Advertisement