బుధవారం, 14 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
గిరిజన యువతకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ మూడో బ్యాచ్ ప్రారంభం
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
రావులపాలెంలో టీడీపీ సమావేశం.. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమన్న కొప్పిశెట్టి ప్రసాద్
బొబ్బిలి నియోజకవర్గంలో రూ.12.5 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం.. పనులకు శంకుస్థాపన చేసిన బేబీనాయన
గుంటూరు మేయర్ అభ్యర్థి రేసులో మాదల మీనా రత్న పేరు!
భోగాపురంలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. నూతన వధూవరులకు ఆశీస్సులు!
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్!
బొల్లాపల్లి ZPTC రేసులో పోక వెంకటరావు.. సేవా కార్యక్రమాలే ఆయన బలం!
మున్సిపల్ రిజర్వేషన్‌తో హుటాహుటిన పెళ్లి.. చైర్‌పర్సన్ పదవిపై కన్ను!
అనకాపల్లి జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. రేసులో నలుగురు మహిళా నేతలు!
చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారి అలంకరణ.. ఘనంగా ప్రత్యేక పూజలు!
15 ఏళ్లలో 10 వేలకుపైగా బుర్రకథలు.. జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి!
పసుపు రైతులకు పండగే.. దుగ్గిరాల మార్కెట్‌లో క్వింటా రూ.18,400!
విశాఖలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి!
నేడు జనసేనలోకి వంగవీటి రాధా? పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికపై ఉత్కంఠ!
AP TODAY / చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారి అలంకరణ.. ఘనంగా ప్రత్యేక పూజలు!
చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారి అలంకరణ.. ఘనంగా ప్రత్యేక పూజలు!
AP TODAY
AP TODAY

6 hours ago

విశాఖపట్నం, అక్టోబర్ 14: విశాఖపట్నం జిల్లా మధురవాడలోని చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం అమ్మవారిని శ్రీ కాత్యాయనీ దేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహానికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, జలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం కాత్యాయనీ దేవిగా అలంకరించిన అమ్మవారికి కుంకుమార్చనలు, బిళ్వదళాలతో పూజలు, సూర్య నమస్కారాలు, హోమం, నీరాజనం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, పట్నాల మూర్తి శర్మల బృందం శాస్త్రోక్తంగా నిర్వహించింది.

అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చంద్రంపాలెం వాస్తవ్యులు మరుపిల్లి బుల్లిబాబు, రమణమ్మ దంపతుల కుమారులు ఆనంద్ దంపతులు, వెంకటరమణ దంపతుల సహకారంతో అమ్మవారికి కట్ట పొంగలి ప్రసాదాన్ని నివేదించి భక్తులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పిళ్లా పోతరాజు, పిళ్లా మోహన్ శివకృష్ణ, జనరల్ సెక్రటరీ నాగోతి తాతారావు, సెక్రటరీ పోతిన పైడిరాజు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి దుక్క వరం, జాయింట్ సెక్రటరీ పోతిన ఉమామహేశ్వరరావు, పోతిన శివ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గూడేల రాజు, పొట్నూరి హరికృష్ణ, బంక వాసు, మీడియా ఇన్‌చార్జి బోగవిల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

అలాగే కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ముఖ్య సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement