బుధవారం, 14 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
గిరిజన యువతకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ మూడో బ్యాచ్ ప్రారంభం
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
రావులపాలెంలో టీడీపీ సమావేశం.. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమన్న కొప్పిశెట్టి ప్రసాద్
బొబ్బిలి నియోజకవర్గంలో రూ.12.5 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం.. పనులకు శంకుస్థాపన చేసిన బేబీనాయన
గుంటూరు మేయర్ అభ్యర్థి రేసులో మాదల మీనా రత్న పేరు!
భోగాపురంలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. నూతన వధూవరులకు ఆశీస్సులు!
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్!
బొల్లాపల్లి ZPTC రేసులో పోక వెంకటరావు.. సేవా కార్యక్రమాలే ఆయన బలం!
మున్సిపల్ రిజర్వేషన్‌తో హుటాహుటిన పెళ్లి.. చైర్‌పర్సన్ పదవిపై కన్ను!
అనకాపల్లి జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. రేసులో నలుగురు మహిళా నేతలు!
చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారి అలంకరణ.. ఘనంగా ప్రత్యేక పూజలు!
15 ఏళ్లలో 10 వేలకుపైగా బుర్రకథలు.. జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి!
పసుపు రైతులకు పండగే.. దుగ్గిరాల మార్కెట్‌లో క్వింటా రూ.18,400!
విశాఖలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి!
నేడు జనసేనలోకి వంగవీటి రాధా? పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికపై ఉత్కంఠ!
AP TODAY / బొబ్బిలి నియోజకవర్గంలో రూ.12.5 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం.. పనులకు శంకుస్థాపన చేసిన బేబీనాయన
బొబ్బిలి నియోజకవర్గంలో రూ.12.5 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం.. పనులకు శంకుస్థాపన చేసిన బేబీనాయన
AP TODAY
AP TODAY

1 hour ago

విజయనగరం జిల్లా, అక్టోబర్ 14: బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో రహదారి సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.12.5 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడుతో కలిసి బుధవారం పలు గ్రామాల్లో రోడ్డు పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

వీబీ-గ్రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్) పథకం కింద ఈ రోడ్డు పనులకు నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరచడం, ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించడం ఈ పనుల ప్రధాన ఉద్దేశం.

ఈ గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణం

  • కారాడ–జనార్ధనవలస: బొబ్బిలి మండలం కారాడ నుంచి తెర్లాం మండలం జనార్ధనవలస గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2.30 కోట్లు.

  • అంట్లవార గ్రామం: తెర్లాం మండలంలోని ఈ గ్రామంలో రోడ్డు పనులకు రూ.1.20 కోట్లు.

  • పి. వెంకంపేట: ఈ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.40 కోట్లు.

  • ఎజి పేట (కోడూరు): బాడంగి మండలంలోని ఈ గ్రామంలో రోడ్డు పనులకు రూ.1.25 కోట్లు.

  • డొంకినవలస: ఈ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.65 కోట్లు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెంట స్వామినాయుడు, ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, తెర్లాం మండల టీడీపీ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేష్, బీజేపీ మండల అధ్యక్షుడు మధు, బాడంగి మండల టీడీపీ అధ్యక్షుడు తెంటు రవి, తెర్లాం మండల జనసేన అధ్యక్షుడు మరడాన రవి, పీఆర్ డీఈ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement