రావులపాలెం మండల పార్టీ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బీసీల రాజకీయ సాధికారత, సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పార్టీ నాయకులు వివరించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 40 శాతం సీట్లు కేటాయిస్తామని టీడీపీ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ఈ సమావేశంలో క్లస్టర్, యూనిట్ ఇన్చార్జీలు, రాష్ట్ర, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.