బుధవారం, 14 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
గిరిజన యువతకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ మూడో బ్యాచ్ ప్రారంభం
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
రావులపాలెంలో టీడీపీ సమావేశం.. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమన్న కొప్పిశెట్టి ప్రసాద్
బొబ్బిలి నియోజకవర్గంలో రూ.12.5 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం.. పనులకు శంకుస్థాపన చేసిన బేబీనాయన
గుంటూరు మేయర్ అభ్యర్థి రేసులో మాదల మీనా రత్న పేరు!
భోగాపురంలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. నూతన వధూవరులకు ఆశీస్సులు!
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్!
బొల్లాపల్లి ZPTC రేసులో పోక వెంకటరావు.. సేవా కార్యక్రమాలే ఆయన బలం!
మున్సిపల్ రిజర్వేషన్‌తో హుటాహుటిన పెళ్లి.. చైర్‌పర్సన్ పదవిపై కన్ను!
అనకాపల్లి జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. రేసులో నలుగురు మహిళా నేతలు!
చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారి అలంకరణ.. ఘనంగా ప్రత్యేక పూజలు!
15 ఏళ్లలో 10 వేలకుపైగా బుర్రకథలు.. జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి!
పసుపు రైతులకు పండగే.. దుగ్గిరాల మార్కెట్‌లో క్వింటా రూ.18,400!
విశాఖలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి!
నేడు జనసేనలోకి వంగవీటి రాధా? పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికపై ఉత్కంఠ!
AP TODAY / బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. కార్మికుల్లో భయాందోళన
బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. కార్మికుల్లో భయాందోళన
AP TODAY
AP TODAY

October 6, 2026

బొబ్బిలి, అక్టోబర్ 6: విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లోని బెర్రీ కంపెనీలో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో స్లాగ్ రీసైక్లింగ్ చేస్తుండగా అందులోని రాళ్లు, పిక్కలు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.

మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అక్కడ ఉన్న లారీ డ్రైవర్ భయాందోళనకు గురై పరుగులు తీశాడు. ఈ క్రమంలో జారి పడటంతో అతడి కాలికి గాయం అయినట్లు సమాచారం. వెంటనే అతడిని చికిత్స కోసం తరలించారు.

మంటలను అదుపులోకి తీసుకురావడానికి బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, గజపతినగరం నుంచి ఫైర్‌ ఇంజిన్లను రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న వెంటనే బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, బొబ్బిలి డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. కంపెనీలో ఉన్న కార్మికులు భయాందోళనకు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే బేబీ నాయన స్పందిస్తూ.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై బుధవారం పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని తెలిపారు. రెవెన్యూ, ఫైర్, పోలీసు శాఖల అధికారులతో విచారణ చేయించి లోపాలను గుర్తిస్తామని చెప్పారు.

ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని, కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ప్రమాదానికి అసలు కారణం, ఆస్తి నష్టం తదితర పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement