బుధవారం, 14 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
గిరిజన యువతకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ మూడో బ్యాచ్ ప్రారంభం
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
రావులపాలెంలో టీడీపీ సమావేశం.. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమన్న కొప్పిశెట్టి ప్రసాద్
బొబ్బిలి నియోజకవర్గంలో రూ.12.5 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం.. పనులకు శంకుస్థాపన చేసిన బేబీనాయన
గుంటూరు మేయర్ అభ్యర్థి రేసులో మాదల మీనా రత్న పేరు!
భోగాపురంలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. నూతన వధూవరులకు ఆశీస్సులు!
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్!
బొల్లాపల్లి ZPTC రేసులో పోక వెంకటరావు.. సేవా కార్యక్రమాలే ఆయన బలం!
మున్సిపల్ రిజర్వేషన్‌తో హుటాహుటిన పెళ్లి.. చైర్‌పర్సన్ పదవిపై కన్ను!
అనకాపల్లి జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. రేసులో నలుగురు మహిళా నేతలు!
చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారి అలంకరణ.. ఘనంగా ప్రత్యేక పూజలు!
15 ఏళ్లలో 10 వేలకుపైగా బుర్రకథలు.. జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి!
పసుపు రైతులకు పండగే.. దుగ్గిరాల మార్కెట్‌లో క్వింటా రూ.18,400!
విశాఖలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి!
నేడు జనసేనలోకి వంగవీటి రాధా? పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికపై ఉత్కంఠ!
AP TODAY / హైదరాబాద్‌లో నైట్ బస్సులు మళ్లీ షురూ.. 6 రూట్లలో 15 సర్వీసులు!
హైదరాబాద్‌లో నైట్ బస్సులు మళ్లీ షురూ.. 6 రూట్లలో 15 సర్వీసులు!
AP TODAY
AP TODAY

September 1, 2026

హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాత్రి వేళల్లో ప్రయాణించే వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది.

మంగళవారం.. సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాద్‌లో ఆరు ప్రధాన మార్గాల్లో నైట్ బస్సు సర్వీసులను పునఃప్రారంభించింది. ఈ బస్సులు రాత్రి 10 లేదా 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. శ్రీధర్ ఈ వివరాలను వెల్లడించారు. ఐటీ కారిడార్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను అనుసంధానిస్తూ మొత్తం 15 బస్సులతో నైట్ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపారు.

ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, డిమాండ్‌ను బట్టి భవిష్యత్‌లో బస్సుల సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు.

గతంలో ‘నైట్ రైడర్స్’ పేరుతో ఆర్టీసీ నైట్ సర్వీసులను నడిపింది. అయితే ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో ఆ సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ముఖ్యంగా ఐటీ, హాస్పిటాలిటీ రంగాల సిబ్బంది, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను తిరిగి ప్రారంభించారు.

ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరు రూట్లు ఇవే..

  • 222A రూట్‌లో కోఠి నుంచి పటాన్‌చెరు వరకు బస్సులు నడుస్తాయి. అబిడ్స్, లక్డీకాపూల్, కొండాపూర్ మీదుగా ఈ సర్వీస్ కొనసాగుతుంది. ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.
  • 218 రూట్‌లో అఫ్జల్‌గంజ్ లేదా సీబీఎస్ నుంచి పటాన్‌చెరు వరకు సర్వీస్ ఉంటుంది. కోఠి, కేపీహెచ్‌బీ, మియాపూర్ మీదుగా బస్సు ప్రయాణిస్తుంది.
  • 219 రూట్‌లో సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు వరకు బస్సులు నడుస్తాయి. ప్యారడైజ్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ మీదుగా ఈ సర్వీస్ కొనసాగుతుంది.
  • 290U రూట్‌లో హయత్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఎల్‌బీనగర్, నాగోల్, తార్నాక మీదుగా సర్వీస్ ఉంటుంది.
  • 195W రూట్‌లో బాచుపల్లి నుంచి వేవ్‌రాక్ వరకు బస్సులు నడుస్తాయి. ఐటీ క్యాంపస్‌లను కలుపుతూ ఈ సర్వీస్ కొనసాగుతుంది.
  • 10H రూట్‌లో కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు నైట్ బస్సు సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

రాత్రివేళల్లో ప్రయాణించే వారికి సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సౌకర్యాన్ని అందించడమే ఈ నైట్ సర్వీసుల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. యాప్ ఆధారిత క్యాబ్‌లపై ప్రయాణికుల ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా పేర్కొన్నారు.

నైట్ బస్సు సర్వీసులకు సంబంధించిన మరింత సమాచారం కోసం 99592 26160 నంబర్‌ను సంప్రదించవచ్చని టీజీఎస్‌ఆర్టీసీ సూచించింది.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement