అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్లో రహదారులపై ఏర్పడిన గుంతలను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పరిశీలించారు. గుంతల కారణంగా వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
జంక్షన్ మీదుగా నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు, స్థానిక ప్రజలకు రహదారుల దుస్థితి కారణంగా ఎదురవుతున్న సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో రహదారుల పరిస్థితిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రహదారుల మరమ్మతులు, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. రహదారుల సమస్యను వెంటనే పరిష్కరించి రోడ్డు పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.