బుధవారం, 14 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
గిరిజన యువతకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ మూడో బ్యాచ్ ప్రారంభం
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
రావులపాలెంలో టీడీపీ సమావేశం.. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమన్న కొప్పిశెట్టి ప్రసాద్
బొబ్బిలి నియోజకవర్గంలో రూ.12.5 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం.. పనులకు శంకుస్థాపన చేసిన బేబీనాయన
గుంటూరు మేయర్ అభ్యర్థి రేసులో మాదల మీనా రత్న పేరు!
భోగాపురంలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. నూతన వధూవరులకు ఆశీస్సులు!
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్!
బొల్లాపల్లి ZPTC రేసులో పోక వెంకటరావు.. సేవా కార్యక్రమాలే ఆయన బలం!
మున్సిపల్ రిజర్వేషన్‌తో హుటాహుటిన పెళ్లి.. చైర్‌పర్సన్ పదవిపై కన్ను!
అనకాపల్లి జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. రేసులో నలుగురు మహిళా నేతలు!
చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారి అలంకరణ.. ఘనంగా ప్రత్యేక పూజలు!
15 ఏళ్లలో 10 వేలకుపైగా బుర్రకథలు.. జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి!
పసుపు రైతులకు పండగే.. దుగ్గిరాల మార్కెట్‌లో క్వింటా రూ.18,400!
విశాఖలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి!
నేడు జనసేనలోకి వంగవీటి రాధా? పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికపై ఉత్కంఠ!
AP TODAY / దేశంలో టాప్-4లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
దేశంలో టాప్-4లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
AP TODAY
AP TODAY

September 2, 2026

రూ.1,276 కోట్ల వార్షిక ఆదాయం.. 2.78 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు

హైదరాబాద్ :  దేశంలో అత్యధిక వార్షికాదాయం ఆర్జించే రైల్వే స్టేషన్ల జాబితాలో సికింద్రాబాద్ జంక్షన్ సత్తా చాటింది. ప్రయాణికుల రాకపోకలు, ఆదాయం పరంగా దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూ.1,276.29 కోట్ల ఆదాయం ఆర్జించగా.. సుమారు 2.78 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ వివరాలను రైల్వే శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

రైల్వే నివేదిక ప్రకారం.. దేశంలో అత్యధిక వార్షికాదాయం ఆర్జించే స్టేషన్లలో న్యూఢిల్లీ రూ.3,337 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రూ.1,692 కోట్లతో రెండో స్థానంలో, తమిళనాడులోని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రూ.1,299 కోట్లతో మూడో స్థానంలో నిలిచాయి. వీటి తర్వాత సికింద్రాబాద్ జంక్షన్ రూ.1,276.29 కోట్ల ఆదాయంతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య కీలకమైన అనుసంధాన కేంద్రంగా సికింద్రాబాద్ జంక్షన్ ఉండటమే ఈ స్థాయిలో ఆదాయం, ప్రయాణికుల రాకపోకలకు ప్రధాన కారణంగా రైల్వే శాఖ పేర్కొంది.

దక్షిణ మధ్య రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయంగా ఉన్న సికింద్రాబాద్ నుంచి రోజుకు 180కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రతిరోజూ సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ ద్వారా ప్రయాణిస్తున్నారు.

రూ.714 కోట్లతో ఆధునికీకరణ

ప్రస్తుతం అమృత్ భారత్ పథకం కింద సుమారు రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. విమానాశ్రయాలకు దీటుగా ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మెట్రో రైలు అనుసంధానం, మల్టీ-లెవల్ పార్కింగ్ వంటి ఆధునిక వసతులను ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు.

ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత స్టేషన్ సామర్థ్యం మరింత పెరుగుతుందని, తద్వారా మరిన్ని రైళ్లు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.

ఈ ఆధునికీకరణ పనులు 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోని టాప్-3 స్టేషన్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement